అక్షరటుడే, ఆర్మూర్: విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా బ్యాన్ చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలన్నారు. సమావేశంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్, నాయకులు రాహుల్, రవీందర్, అక్షయ, ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.