అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో ఏర్పాటు చేయనున్న శ్రీ చైతన్య విద్యా సంస్థను బహిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు వారు శనివారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంస్థలో చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. రూ.లక్షల్లో ఫీజులు, విద్యార్థులపై సిబ్బంది వేధింపులు చూస్తున్నామన్నారు. సమావేశంలో శివ, కార్తీక్, సాయికుమార్, విఠల్, రాజు, కిరణ్, అశోక్ పాల్గొన్నారు.