అక్షరటుడే, ఇందూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, ఉద్యోగులకు వీకెండ్ కలిసి రావడంతో పట్టణాల్లో నివాసం ఉంటున్న వారు స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో నగరంలోని బస్టాండ్ రద్దీగా మారింది. పండుగ సందర్బంగా ఇప్పటికే నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ 450 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయినా ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు.