అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలకు పడకల్ విద్యార్థులు ఎంపికయ్యారని పీఈటీ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఈనెల జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో క్రీడాకారులు శ్వేత, కైలాష్ పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 28 నుంచి రామగుండంలో టోర్నీ జరగనుందన్నారు. క్రీడాకారులను హెచ్ఎం సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.