అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగరంలోని 1వ టౌన్‌ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి అందజేశారు. శుక్రవారం 14 సెల్‌ఫోన్లను స్టేషన్‌ ఆవరణలో బాధితులకు అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.