అక్షరటుడే, ఇందూరు: నగరంలోని దుబ్బరోడ్ అక్షరధామ్ పాఠశాలలో శనివారం పింక్ డే నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పింక్ డ్రెస్‌లు వేసుకొని అలరించారు. ప్రాథమిక విద్యార్థులకు కలర్ ప్రాముఖ్యత తెలపడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు మూర్తి తెలిపారు.