అక్షరటుడే, నిజాంసాగర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పార్టీలకు అతీతంగా గడపగడపకు అందిస్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు. శుక్రవారo నిజాంసాగర్ మండలం మాగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. పథకాల కోసం ఎటువంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, ఈజీఎస్ ఏపీవో శివకుమార్, గుర్రపు శ్రీనివాస్ పాల్గొన్నారు.