అక్షరటుడే, జుక్కల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఎంఈవో దేవి సింగ్ అన్నారు. ఆయన శనివారం కుర్తి ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. పిల్లల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ప్రగతిని తరగతి గదిలో వెళ్లి పరిశీలించారు. రోజువారి మధ్యాహ్న భోజన వివరాలను ఆన్ లైన్ లో ప్రతిరోజూ నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విఠల్ రావు, నాగరాణి, శ్యామా గౌడ్, శిల్ప, సీఆర్పీ గోపాల్ సింగ్ పాల్గొన్నారు.