అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై పీఎం మోదీ స్పందించారు. ఘటనపై శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. టన్నెల్లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కేంద్రం నుంచి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.