అక్షరటుడే, ఇందూరు: జిల్లా కవులు డాక్టర్ నాగేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, నరసింహస్వామి, తిరుమల శ్రీనివాస్, నరాల సుధాకర్ కలిసి రూపొందించిన “పచ్చబొట్టు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి తొలి పుస్తకాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, కవిత, రమేష్, బైస దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.