అక్షరటుడే, బోధన్: చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి వేకువ జామున వెళ్తున్న 28 మంది కార్యకర్తలను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో ఆశా కార్యకర్తల యూనియన్ ప్రతినిధులు విజయలక్ష్మి, సుజాత, జ్యోతి, భాగ్య ఉన్నారు.