హైవే వ్యాపారులు సూచనలు పాటించాలి

0

అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: జాతీయ రహదారి పక్కన వ్యాపారాలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. నేషనల్ హైవే 44 పక్కన గల వ్యాపార సముదాయాల యాజమాన్యాలతో శుక్రవారం ఇందల్వాయి టోల్ గేట్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ వారికి సూచనలు చేశారు. వ్యాపార సముదాయాల ముందు జాతీయ రహదారిపై వాహనాలు నిలపనివ్వకూడదని, విధిగా పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలు విక్రయించరాదని పేర్కొన్నారు. జాతీయ రహదారుల సంస్థ నుండి అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిచ్పల్లి సీఐ మల్లేష్, హైవే అధికారులు రామారావు, ప్రసన్న, అనిల్, ప్రణయ్, వీరబాబు, స్వామి, ఐరాడ్ మేనేజర్ వర్ష నిహంత్, రవితేజ, రోజా తదితరులు పాల్గొన్నారు.