అక్షరటుడే, బోధన్: బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్‌షాక్‌తో చనిపోయిన వారి మృతదేహాలను పోలీసులు రోడ్డు వరకు మోసుకు వచ్చారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి దంపతులు, వారి కుమారుడు కిషన్ పొలంలో కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. పొలం నుంచి రోడ్డు వరకు వారి మృతదేహాలను సీఐ విజయ్‌బాబు, పోలీసులు మోసుకొచ్చారు.