అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ పాత నేరస్థుడు. దూల్​పేట నుంచి గంజాయి తీసుకొచ్చి కామారెడ్డిలో విక్రయిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన అన్వర్​ను కూడా గంజాయి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. పట్టణంలోని ఓ కల్యాణ మండపం వద్ద వీరు గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై శ్రీరామ్ పట్టుకున్నారు. వారి నుంచి 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.