అక్షరటుడే, వెబ్​డెస్క్​: తిరుమలలో శ్రీవారి దర్శనం పేరుతో అమాయక భక్తులను మోసం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన చంద్రలేఖ గోపాల్​, శరవణన్​, శరత్​లు కలిసి తిరుపతికి వచ్చే అమాయక భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఓ భక్తుడి వద్ద రూ.300 దర్శనం రెండు టికెట్ల కోసం రూ.70 వేలు వసూలు చేశారు. శ్రీవాణి, బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికారు. చివరికి మోసం చేయడంతో భక్తుడి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ​