అక్షరటుడే, బోధన్: మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్న నేపథ్యంలో వీరిని అరెస్టు చేశారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు అనంపల్లి ఎల్లయ్య, నీరడి రవి, దేవేందర్, కారం స్వామి, యాదగిరి, సుభాష్, డిస్కో సాయిలు ఉన్నారు.