అక్షరటుడే, హైదరాబాద్: గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి పోలీసులు 3 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్బులో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బౌన్సర్లు గాయపడ్డారు. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరోటి లభ్యం అయింది.