అక్ష‌ర‌టూడే, పెద్ద‌ప‌ల్లి : మున్సిపల్ కార్పొరేష‌న్ కార్యాల‌యాన్ని ముట్టిడించిన కేసులో 33 మంది బీఆర్ ఎస్ నాయ‌కుల‌పై గోదావ‌రిఖ‌నిలో పోలీసులు కేసు న‌మోదు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేట‌ర్, ఎమ్మెల్యే బావ‌మ‌రిది నిర్మించిన ఫంక్ష‌న్ హాల్‌ను కూల్చివేయ‌డంతో మాజీ ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో కార్పొరేష‌న్ ఆఫీస్ ను ముట్ట‌డించారు. అరెస్టు చేసేందుకు వ‌చ్చిన పోలీసుల‌తో దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో 33 మందిపై పోలీసులు కేసున‌మోదు చేశారు.