అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై ఉదయ్‌కుమార్‌ను ఢీకొట్టిన ఘటనలో కారును పోలీసులు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేశారు. ఇటీవల నగరంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో బాబన్‌సాబ్ పహాడ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఎస్సైని ఢీకొట్టి పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. కారు నడిపిన వ్యక్తితో పాటు మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం.