అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ర్యాపిడ్​ యాక్షన్​ పోర్స్​తో కలిసి ఐదో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఫ్లాగ్​ మార్చ్​ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్​రెడ్డి, సీఐ సురేష్, ఎస్సైలు గంగాధర్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.