అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మారుతినగర్లో ఓ వ్యభిచారం గృహంపై పోలీసులు దాడిచేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం.. మారుతినగర్లో వ్యభిచారం జరగుతుందనే సమాచారం మేరకు సోమవారం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీసీఎస్ సిబ్బంది కలిసి వ్యభిచార గృహంపై రైడ్ చేశారు. నలుగురు మహిళలను, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,600 నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.