అక్షరటుడే, ఇందూరు: ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంజీవయ్య కాలనీకి చెందిన మల్లేష్(63) గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 15న బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగగా.. కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.