అక్షరటుడే,బోధన్: డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 74 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ షేక్ అబ్బాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.