అక్షరటుడే, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 13,766 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలు, 35 వేల మంది ఢిల్లీ పోలీసులు, 19 వేల మంది హోంగార్డులు విధుల్లో ఉన్నారు. 3 వేల పోలింగ్ స్టేషన్లను సెన్సిటివ్ గా గుర్తించి, డ్రోన్ల సహాయంతో పహారా కాస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6,980 మంది ఇప్పటికే హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.