అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కామారెడ్డి పట్టణంలో సందడి చేశారు. అయన మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ ఇంటికి రాగా వారు సాదరంగా ఆహ్వానించారు. బ్రహ్మానందం వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఛైర్‌పర్సన్ ఇంటికి వచ్చి బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విబూస్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం కోసం కామారెడ్డికి వచ్చానన్నారు.