అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో మరోసారి వివాదంలో చిక్కుకొంది. ‘దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఓయో కూడా అలానే’ అంటూ తాజాగా ఇచ్చిన ప్రకటన వివాదానికి కారణం అయింది. తమ మనోభావాలను ఓయో దెబ్బతీస్తోందంటూ కొందరు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో ‘బాయ్‌కాట్‌ ఓయో’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మేరకు సంస్థ స్పందించి వివరణ ఇచ్చింది. అయోధ్య, వారణాశి, ప్రయాగ్‌రాజ్‌, అమృత్‌సర్, అజ్మేర్‌ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తాము సేవలందిస్తున్నామని చెప్పేందుకే ఇలా ప్రకటన ఇచ్చినట్లు ఓయో చెప్పుకొచ్చింది.