అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్(Collectorate)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్‌కు విన్నవిస్తూ అర్జీ(complaints)లు సమర్పించారు.
కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్(Collector) అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.