అక్షరటుడే, కామారెడ్డి: ప్రజావాణిలో వచ్చే వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు మసూర్ అహ్మద్, సీపీవో రాజారాం, డీఆర్‌డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement