అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్టీసీ కాలనీలో మార్కండేయ పద్మశాలి సంఘం 60వ తర్ప భవన నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేసినట్లు అధ్యక్షుడు అల్లె నాగభూషణం తెలిపారు. మానిక్‌ భండార్‌ శివారులో 316 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణం కోసం ఛైర్మన్‌గా బిల్ల శంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. స్థలాన్ని తర్ప సభ్యులు పరిశీలించారు.