అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రజాధనం పెద్దఎత్తున దుర్వినియోగం అయిందని, దానిపై సమగ్ర విచారణ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు. ఈవ్యవహారంపై గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రాజెక్టును ప్రజల కోసం చేసింది కాదని, కేవలం లాభాపేక్షతోనే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈప్రాజెక్టు పనుల్లో రాజకీయ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుందని, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వక సీఎం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేశారని ఆరోపించారు.