అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయిని ప్రధాని మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ నుంచి రూ.వేల కోట్లను మహారాష్ట్ర ఎన్నికల నిమిత్తం తరలిస్తున్నారన్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలు కాంగ్రెస్ రాజకుటుంబానికి కప్పం కడుతున్నారని, ఈ అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.