అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ధ్యేయంగా చేసిన అభివృద్ధి ప్రతిరంగంలో కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్ 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుందన్నారు. పదేళ్లలో ఆర్థికవ్యవస్థ మారడంతో ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, ఎఫ్‌డీఐలు రెండింతలు పెరిగాయన్నారు. ‘ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2024’లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఇది టెక్,డేటా నడిపించే శతాబ్దమన్నారు. ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని, డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధి పెరిగిందన్నారు.