అక్షరటుడే, ఇందూరు: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఇరువురు వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో డీఎస్ చేసిన సేవలను కొనియాడారు. డీఎస్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి డీఎస్ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేశారు.