అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. భారత్‌-యూఎస్‌ సమగ్ర భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఇద్దరం కలిసి ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం పనిచేద్దామని ట్వీట్‌లో పేర్కొన్నారు.