అక్షరటుడే వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో వార్షిక క్వాడ్ సమ్మిట్‌కు హాజరవుతారు. న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. టెక్నాలజీలో పనిచేస్తున్న అగ్రశ్రేణి అమెరికన్ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. క్వాడ్ సమ్మిట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన స్వస్థలమైన విల్మింగ్టన్‌లో శనివారం నిర్వహించనున్నారు.