అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు సోదరుడిలాంటి వారని, ఆయనను కలిసిన ప్రతిసారి సంతోషంగా ఉంటుందన్నారు. మోదీ తనకు గురువని, మరింత కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తిని ఆయన నుంచి పొందుతానని తెలిపారు.