అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: నిజామాబాద్​లోని నాగారంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్​ కిరణ్​గౌడ్​ తెలిపారు. ఐదో తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో బ్యాక్​లాగ్​ సీట్లు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీ విద్యార్థుల్లో ముందు వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. నాన్​ మైనారిటీలో వచ్చిన దరఖాస్తులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9010456538 నంబర్​ను సంప్రదించాలన్నారు.