అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: విద్యుత్ శాఖలో పలువురికి పదోన్నతులు కల్పించారు. డిచ్‌పల్లి ఉమ్మడి డివిజన్‌లో 97 మంది జేఎల్‌ఎంలకు అసిస్టెంట్ లైన్‌మన్లుగా ప్రమోషన్ ఇచ్చారు. సీఎండీ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ డీఈఈ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రమోషన్లు కల్పించడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.