అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్ కోరారు. ఈ సందర్భంగా గురువారం డీఈవో అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతర మాట్లాడుతూ సంబంధిత ఉపాధ్యాయులు ప్రభుత్వ, జిల్లా విద్యాశాఖ ఇచ్చిన నియామక ఉత్తర్వులు, జాయినింగ్ రిపోర్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ట్రెజరీలో సమర్పించాలన్నారు. వాటితో పాటు జిల్లా విద్యాశాఖాధికారితో జారీచేయబడిన నూతన ఉపాధ్యాయుల జాబితా, యాక్ట్-2 సర్టిఫికెట్, డీడీఓ అటెస్టేషన్ చేయించి ట్రెజరీలో సమర్పిస్తే వేతనాలు మంజూరవుతాయని ఆయన పేర్కొన్నారు.