అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రవ్యాప్తంగా జీవో 317 స్థానికత ప్రకారం బదిలీలు చేపట్టాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్‌ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ హాల్‌లో నిర్వహించిన పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే గెజిటెడ్‌ హెచ్‌ఎం ప్రమోషన్లను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను ప్రకటించాలని, డీఎస్సీ 2008 ఉపాధ్యాయులకు నియామకాలు చేపట్టాలన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మినీమం టైం స్కేల్‌ ఇప్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌, నాయకులు బుచ్చన్న, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.