అక్షరటుడే, వెబ్ డెస్క్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ను ప్రయోగించనున్నారు. సాయంత్రం 4:08 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లే ఈ రాకెట్ కోసం ఈ రోజు మధ్యాహ్నం 3:08 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఈ రాకెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగాన్ని పరిశీలించేందుకు శ్రీహరికోటకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఈరోజు రానున్నారు.