అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పుష్ప–2 ది రూరల్ సినిమా ఇక ఓటీటీలో సందడి చేయనుంది. అభిమానులకు మరింత జోష్ పెంచే విధంగా రీలోడెడ్ వెర్షన్ జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,896 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు.