అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని 56వ డివిజన్లో చేపట్టిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. రూ.15 లక్షల ఎస్డీపీ నిధులతో పనులు చేపట్టగా.. అధ్వానంగా సాగుతున్నాయి. రోడ్డు పనుల కోసం డస్ట్ వాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ నేతల బినామీలకు ఈ పనులు అప్పగించగా వారు నాణ్యత పాటించడం లేదు. ఇసుకకు బదులు డస్ట్ వినియోగించి పనులు పూర్తి చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోడ్డు వేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాసిరకం పనులపై విచారణ జరిపి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.