అక్షరటుడే, వెబ్‌డెస్క్: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. 180 కేఎంపీహెచ్ వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు దూసుకెళ్లింది. అంతవేగంలోనూ ట్రేపై నీటిగ్లాసు తొణకకుండా సాఫీగా ప్రయాణం సాగింది. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ సహా పలు మార్గాల్లో నడపనున్నారు.