అక్షరటుడే, ఇందూరు: రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన కుమారి రెడ్డి రేణుక(23) బాసర టెంపుల్ కు వెళ్లి దర్శనం చేసికొని తిరిగి ఇంటర్ సిటీ ట్రైన్ లో హైదరాబాద్ కు వెళ్తుండగా ఆమె గొలుసు చోరీ అయ్యింది. జానకంపేట రైల్వే స్టేషన్లో రైలు క్రాసింగ్ అయ్యాక.. తిరిగి కదులుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కిటికీలో నుంచి రేణుక మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.