అక్షరటుడే, కామారెడ్డి: రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి పేద విద్యార్థులకు అండగా నిలిచారని ఆర్ బీ వీ ఆర్ జిల్లా ట్రస్ట్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. వెంకట్ రామారెడ్డి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ట్రస్ట్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు వసతి ఏర్పాటు చేశారన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతినిధులు సంతోష్ రెడ్డి, రమేష్ రెడ్డి, అంజల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, బాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.