అక్షరటుడే, కామారెడ్డి : కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాజబోయిన డాకవ్వ (60) అదృశ్యమైందని దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఈమె గతంలో కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేదన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో వీరి కుటుంబం వ్యవసాయ పనులతో బయటకు వెళ్లగా ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిందని తిరిగి సాయంత్రం వరకు చూసినా రాలేదన్నారు. వృద్ధురాలి బంధువు రాజబోయిన లక్ష్మీపతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.