అక్షరటుడే, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుందిళ్ల బ్యారేజ్ గుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్సై రాజేష్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.