అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడు రమావత్ ఓంకార్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గణిత శాస్త్ర విభాగంలో ‘న్యూమరికల్ మెథడ్స్ ఫర్ డిఫరెన్షియల్ –డిఫరెన్స్ ఈక్వేషన్స్ విత్ లేయర్ బిహేవియర్’ అనే అంశంపై పరిశోధనకుగాను గురువారం ఓయూ నుంచి డాక్టరేట్ అందుకున్నట్లు తెలిపారు. ఇటీవలి జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకుతోపాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు ఉత్తీర్ణత సాధించిన ఓంకార్‌ను ప్రొఫెసర్లు, మిత్రులు, గ్రామస్థులు పలువురు అభినందించారు.