అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆర్డీవో రమేశ్ రాథోడ్ అన్నారు. మండలంలోని బుడ్మి ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అశ్రద్ధ వహించవద్దని, నాణ్యత లోపిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.